ఆరు నెలల్లో రామ మందిర నిర్మాణం ప్రారంభం.. వీహెచ్ పీ రూపొందించిన మోడల్ కు కొన్ని మార్పులు చేస్తామన్న ట్రస్టు
- రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడి
- గుడి ఎత్తు 125 ఫీట్ల నుంచి 160 ఫీట్లకు పెంపు
- అదనంగా మూడో అంతస్తు నిర్మాణం
- నిపుణులతో చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడి
అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఆరు నెలల్లోగా ప్రారంభమవుతుందని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తెలిపింది. ఈ ఆలయం కోసం విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) గతంలోనే రూపొందించిన మోడల్ కు కొన్ని మార్పులు చేసి నిర్మిస్తామని వెల్లడించింది. దీనికి సంబంధించి అయోధ్య లోని అఖాడాలను సంప్రదిస్తామని, నిపుణులతోనూ చర్చించాక తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది.